మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటిని సమావేశపరచి వారితో, “మీరు పాటించడానికి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే: ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి. సబ్బాతు దినాన మీరు మీ నివాసాల్లో మంట వెలిగించకూడదు.” మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటితో, “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే: మీ దగ్గర ఉన్నదానిలో నుండి యెహోవా కోసం అర్పణ తీసుకురావాలి. ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుక తెచ్చే ప్రతి ఒక్కరు ఇవి తీసుకురావలసినవి: “బంగారం, వెండి, ఇత్తడి; నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు; ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు మన్నికైన తోలు; తుమ్మకర్ర; దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు; ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.
చదువండి నిర్గమ 35
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమ 35:1-9
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు