నిర్గమ 21:20-24

నిర్గమ 21:20-24 OTSA

“ఎవరైనా తమ దాసుని గాని దాసిని గాని కర్రతో కొట్టినప్పుడు ఒకవేళ వారు చనిపోతే కొట్టినవారు శిక్షించబడాలి, కాని ఒకవేళ వారు ఒకటి లేదా రెండు రోజుల్లో కోలుకుంటే, ఆ దాసులు వారి ఆస్తియే కాబట్టి వారు శిక్షించబడనక్కర్లేదు. “ఒకవేళ ప్రజలు పోట్లాడుకుంటూ గర్భవతియైన స్త్రీని కొట్టినప్పుడు ఆమె అకాల జన్మనిస్తే ఆమెకు గర్భస్రావమై మరి ఏ ఇతర గాయాలు కాకపోతే, దానికి కారణమైనవాడు ఆమె భర్త అడిగిన నష్టపరిహారాన్ని న్యాయాధిపతులు నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి. తీవ్రమైన గాయాలు అయినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు

నిర్గమ 21:20-24 కోసం వీడియో