ఎస్తేరు 4:11-15

ఎస్తేరు 4:11-15 OTSA

“రాజు పిలువకుండా పురుషుడు గాని స్త్రీ గాని రాజు యొక్క అంతఃపురం లోనికి వెళ్తే, రాజు తన బంగారు దండాన్ని వారివైపు చాపి వారిని బ్రతకనిస్తే తప్ప లేకపోతే వారు చంపబడాలి అనే ఒక చట్టం ఉందని రాజు అధికారులందరికి, రాజ్య సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి తెలుసు. అయితే ముప్పై రోజులుగా నేను రాజు దగ్గరకు వెళ్లడానికి నాకు పిలుపు రాలేదు.” ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు, మొర్దెకై ఎస్తేరుకు మళ్ళీ ఈ జవాబు పంపాడు: “నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీవు మాత్రమే రక్షింపబడతావు అని అనుకోకు. నీవు మౌనంగా ఉంటే, యూదులకు ఉపశమనం, విడుదల వేరే స్థలం నుండి వస్తుంది, అయితే నీవు, నీ తండ్రి కుటుంబం నశిస్తుంది. నీవు ఇలాంటి సమయం కొరకే నీ రాజ్య స్థానంలోనికి వచ్చావేమో ఎవరికి తెలుసు?” అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది

Read ఎస్తేరు 4