యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు. యుద్ధానికి వెళ్లే ఏ సైనికుడైన తన సాధారణ జీవన వ్యాపార విషయాల్లో ఇరుక్కుపోడు కాని, తనపై అధికారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. అదే విధంగా ఒక క్రీడాకారుడు క్రీడానియమాల ప్రకారం పందెంలో పాల్గొంటేనే తప్ప విజయ కిరీటాన్ని పొందుకోలేడు. అలాగే పంటలోని భాగం మొదటిగా పొందాల్సింది కష్టపడి పని చేసే రైతే. నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించు, మన ప్రభువు నీకు అన్ని విషయాలను తెలుసుకోగల పరిజ్ఞానాన్ని దయచేస్తారు. మహారాజైన దావీదు సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచారని గుర్తుంచుకో. ఇదే నేను ప్రకటించిన సువార్త. దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు. కాబట్టి, దేవునిచే ఎన్నుకోబడినవారు కూడా నిత్యమహిమతో యేసు క్రీస్తులో ఉన్న రక్షణను పొందాలని నేను ఈ శ్రమలన్నింటిని సహిస్తున్నాను.
Read 2 తిమోతి పత్రిక 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 తిమోతి పత్రిక 2:3-10
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు