2 కొరింథీ పత్రిక 6:3-13

2 కొరింథీ పత్రిక 6:3-13 OTSA

మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు. కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో; దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో; పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో; సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి; ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది; తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు; దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము. కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం. మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు. నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.