1 సమూయేలు 27:8-12

1 సమూయేలు 27:8-12 OTSA

తర్వాత దావీదు అతని మనుష్యులు బయలుదేరి గెషూరీయులమీద గెజెరీయులమీద, అమాలేకీయుల మీద దాడి చేశారు. (పూర్వం నుండి ఈ ప్రజలు షూరు, ఈజిప్టు వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో నివసించారు.) దావీదు ఎక్కడ దాడి చేసినా అక్కడ మగవారిని ఆడవారిని ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు, కాని గొర్రెలను ఎద్దులను గాడిదలను ఒంటెలను వస్త్రాలను దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరకు వచ్చేవాడు. ఆకీషు, “ఈ రోజు మీరెక్కడ దాడి చేశారు?” అని అడిగినప్పుడు, దావీదు, “యూదా దేశానికి యెరహ్మెయేలు దేశానికి కెనీయుల దేశానికి దక్షిణంగా ఉన్న చోటుపై దాడి చేశాం” అని చెప్పాడు. దావీదు ఇలా చేస్తున్నాడని తమ గురించి సమాచారం అందిస్తారని భావించిన దావీదు గాతుకు తీసుకురావడానికి పురుషులను గాని స్త్రీలను గాని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అలాగే చేస్తూ ఉన్నాడు. దావీదును నమ్మిన ఆకీషు, “ఇతనికి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద చాలా అసహ్యం ఏర్పడింది, కాబట్టి ఇతడు జీవితాంతం నాకు సేవకునిగా ఉంటాడు” అని అనుకున్నాడు.