1 సమూయేలు 24:2-6

1 సమూయేలు 24:2-6 OTSA

కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడువేలమంది యువకులను ఏర్పరచుకొని కొండమేకలు ఉండే రాతి గుట్టలలో దావీదును అతని ప్రజలను వెదకడానికి బయలుదేరాడు. దారిలో గొర్రెల దొడ్ల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక గుహ ఉంది. సౌలు మూత్ర విసర్జన కోసం దాని లోపలికి వెళ్లాడు. ఆ గుహలో చాలా లోపల దావీదు అతని మనుష్యులు ఉన్నారు. ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు. కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి, “ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు.