1 సమూయేలు 11:12-15

1 సమూయేలు 11:12-15 OTSA

అప్పుడు ప్రజలు సమూయేలుతో, “సౌలు మనలను పరిపాలిస్తాడా అని అడిగిన వారేరి? మేము వారిని చంపడానికి వారిని తీసుకురండి” అన్నారు. అయితే సౌలు, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు కాబట్టి ఈ రోజు ఎవరిని చంపవద్దు” అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రజలతో, “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా ఏర్పరచుకుందాము” అన్నాడు. కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.