ప్రకటన 6:1-6

ప్రకటన 6:1-6 TSA

వధించబడిన గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూశాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి ఉరుముతున్న స్వరంతో, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు. ఆ వధించబడిన గొర్రెపిల్ల రెండవ ముద్రను విప్పినప్పుడు, రెండవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు మండుతున్న ఎర్రని మరొక గుర్రం బయలుదేరింది; దాని మీద స్వారీ చేసేవానికి భూమి మీద నుండి సమాధానం తీసివేయడానికి, ప్రజలు ఒకరిని ఒకరు చంపుకొనేలా చేయటానికి అధికారం ఇవ్వబడింది. అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. ఆ వధించబడిన గొర్రెపిల్ల మూడవ ముద్రను విప్పినప్పుడు, మూడవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాడు చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను.

ప్రకటన 6:1-6 కోసం వీడియో