యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది; ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి. ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు. ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి. ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి; అది చూసి భూమి కంపిస్తుంది. యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు. ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి, ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు.
చదువండి కీర్తనలు 97
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 97:1-6
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు