కీర్తనలు 89:38-44

కీర్తనలు 89:38-44 TSA

కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు, మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు. మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి, అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు. మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు అతని బలమైన కోటలను పాడుచేశారు. దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు; అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు. మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు; అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు. నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు యుద్ధంలో అతనికి సాయం చేయలేదు. మీరు అతని వైభవాన్ని అంతం చేశారు అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.