కీర్తనలు 81:8-14

కీర్తనలు 81:8-14 TSA

నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట మాత్రం వింటే ఎంత మేలు! మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు; మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను. మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను. “కాని నా ప్రజలు నా మాట వినలేదు; ఇశ్రాయేలు నాకు లోబడలేదు. కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు! నేను వారి మొండి హృదయాలకు వారిని అప్పగించాను. “నా ప్రజలు నా మాట మాత్రమే వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే, అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని, వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని!