మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు; మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు. మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు, అది వేళ్ళూనుకొని భూమిని నింపింది. దాని నీడ పర్వతాలను కప్పింది, దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి. దాని కొమ్మలు సముద్రం వరకు, దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి. దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు? అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి, పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి. సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి! ఆకాశం నుండి ఇటు చూడండి! ఈ ద్రాక్షవల్లిని గమనించండి. అది మీ కుడి హస్తం నాటిన వేరు, మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు. మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది; మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు. మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి. అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము; మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము. సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా, మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
చదువండి కీర్తనలు 80
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 80:8-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు