ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు. శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు. నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు. ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు. నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు. నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు. ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను. నా నీతిని బట్టి, ఆయన దృష్టిలో నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి, యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు. నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు. యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు, నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు. మీరు దీనులను రక్షిస్తారు కాని అహంకారులను అణిచివేస్తారు. యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు. మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను. దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు. యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే. నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు. నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు. మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది; మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది. నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.
చదువండి కీర్తనలు 18
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 18:16-36
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు