కీర్తనలు 145:8-19

కీర్తనలు 145:8-19 TSA

యెహోవా కృప కలవారు, దయ గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు. యెహోవా అందరికి మంచివారు; ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు. యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది; నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు. మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు మీ బలము గురించి మాట్లాడతారు, అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు. మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు. యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు, అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు. అందరి కళ్లు మీ వైపు చూస్తాయి, సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు. మీరు మీ గుప్పిలి విప్పి జీవులన్నిటి కోరికలు తీరుస్తారు. యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు. ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు. ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు; వారి మొర విని వారిని రక్షిస్తారు.