ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను. మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి. నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను. నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను. మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను. నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు. మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి! మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము. మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు.
చదువండి కీర్తనలు 119
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 119:97-105
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు