సామెతలు 5:15-23

సామెతలు 5:15-23 TSA

మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి. మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా? వాటిని మీకు మాత్రమే చెందినవిగా ఉండనివ్వండి, అపరిచితులతో ఎన్నడు పంచుకోవద్దు. నీ ఊట ఆశీర్వదించబడును గాక, నీ యవ్వన కాలమందు నీ భార్య యందు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడు తృప్తి కలుగజేయును గాక, ఆమె ప్రేమతో నీవు ఎల్లప్పుడు మత్తులో ఉందువు గాక. ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు? దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు? ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి, ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు. దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి; వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారు చస్తారు, వారి సొంత అతి మూర్ఖత్వం ద్వార దారి తప్పారు.