సామెతలు 18:17-24

సామెతలు 18:17-24 TSA

ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు, వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది. చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది. కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము. వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి. నోటి ఫలం చేత ఒక వ్యక్తి కడుపు నిండుతుంది, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తినొందుతాడు. చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు. భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు. పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు, కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు. నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు, కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.