నెహెమ్యా 2:17-20

నెహెమ్యా 2:17-20 TSA

నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను. అంతే కాకుండా దేవుని కృపాహస్తమే నాకు తోడుగా ఉండడం గురించి రాజు నాతో చెప్పినవన్నీ వారితో చెప్పాను. అందుకు వారు, “మనం పునర్నిర్మాణం మొదలుపెడదాం” అని చెప్పి ఈ మంచి పనిని ప్రారంభించారు. హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన సేవకుడు టోబీయా, అరబీయుడైన గెషెము ఈ సంగతి విని మమ్మల్ని వేళాకోళం చేశారు. “మీరేం చేస్తున్నారు? రాజు మీద తిరుగుబాటు చేస్తారా?” అని మమ్మల్ని అడిగారు. అందుకు నేను, “పరలోకపు దేవుడే మాకు విజయాన్ని ఇస్తారు కాబట్టి ఆయన సేవకులమైన మేము పునర్నిర్మాణం మొదలుపెడతాము. మీకు యెరూషలేములో భాగం గాని, చారిత్రాత్మకమైన హక్కు గాని లేదు” అని వారితో చెప్పాను.