మత్తయి 3:10-12

మత్తయి 3:10-12 TCV

ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర ఉంది, మంచి పండ్లను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. “పశ్చాత్తాపం కొరకు నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కల్లమును శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు.”