మత్తయి 14:25-33

మత్తయి 14:25-33 TCV

సూర్యోదయానికి కొంచెం ముందు యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చారు. ఆయన నీళ్ళ మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకొంటూ భయంతో కేకలు వేశారు. వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు. పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి, నీళ్ళ మీద యేసువైపు నడిచాడు. కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేసాడు. వెంటనే యేసు తన చెయ్యి చాపి పేతురును పట్టుకొని, “అల్ప విశ్వాసి, నీవు ఎందుకు అనుమానించావు?” అన్నారు. వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణిగిపోయింది. అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.