అప్పుడు యేసు, “అప్పు ఇచ్చే వాని దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల దేనారాలు, మరొకడు యాభై దేనారాలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చడానికి వారిద్దరి దగ్గర ఏమీ లేదని అతడు వారిద్దరి అప్పును క్షమించాడు. కాబట్టి వారిద్దరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, చెప్పు?” అని అడిగారు. అందుకు సీమోను, “అతడు, ఎవని బాకీని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అని చెప్పాడు. యేసు, “నీవు సరిగా అంచనా వేసావు” అని అతనితో చెప్పారు. తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు గానీ, ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గానీ, నేను లోపలికి వచ్చినప్పటి నుండి, ఈమె నా పాదాలకు ముద్దుపెట్టడం మానలేదు. నీవు నా తలకు నూనె పూయలేదు గానీ, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. కనుక నేను నీతో చెప్పేది ఏమనగా, ఆమె విస్తారంగా ప్రేమ చూపినందుకు ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కాని ఎవరి పాపాలు కొంచెమే క్షమించబడ్డాయో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పారు. అప్పుడు యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు.
Read లూకా 7
వినండి లూకా 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 7:41-48
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు