ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గాబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు. అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది. అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.
Read లూకా 1
వినండి లూకా 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 1:26-33
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు