లేవీయ 25:1-23

లేవీయ 25:1-23 TSA

సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి. ఆరు సంవత్సరాలు పొలంలో విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లవచ్చు, ద్రాక్షతోటలు సాగుచేసుకుని వాటి ఫలాలు సమకూర్చుకోవచ్చు. కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు. దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి. సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది, అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు. “ ‘ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాలు లెక్కించాలి అంటే ఏడు సంవత్సరాలు ఏడు మార్లు గుణిస్తే ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం నలభై తొమ్మిది సంవత్సరాలు. ఏడవ నెల పదవ రోజు అంతటా బూరధ్వని చేయాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఈ బూరధ్వని చేయాలి. యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి. యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు. అది యాభైయవ వార్షికోత్సవం, మీకు పరిశుద్ధంగా ఉండాలి; నేరుగా పొలాల నుండి తీసుకున్న దానిని మాత్రమే తినాలి. “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు. “ ‘మీ సొంత ప్రజలకు స్థలమేదైన అమ్మినా లేదా వారి నుండి కొన్నా, ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం ఆశించకూడదు. గత యాభైయవ వార్షికోత్సవం తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో లెక్క చూసి ఆ ప్రకారం మీ సొంత ప్రజల దగ్గర పొలం కొనాలి. పంట పండించడానికి మిగతా సంవత్సరాల లెక్క ప్రకారమే అతడు అమ్మాలి. సంవత్సరాలు చాలా ఉన్నప్పుడు, మీరు ధరను పెంచాలి, సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పుడు, మీరు ధరను తగ్గించాలి, ఎందుకంటే మీకు నిజంగా అమ్మబడుతుంది పంటల సంఖ్య. ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం చూసుకోకూడదు కాని మీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘నా శాసనాలు పాటించండి, నా చట్టాలకు లోబడుటలో జాగ్రత్త వహించండి, తద్వార మీరు దేశంలో క్షేమంగా జీవిస్తారు. అప్పుడు భూమి దాని ఫలాలను ఇస్తుంది, మీరు మీ సమృద్ధి నుండి తిని అక్కడ క్షేమంగా జీవిస్తారు. “మేము మా పంటలను నాటడం లేదా పండించకపోతే ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము?” అని మీరు అడగవచ్చు. ఆరవ సంవత్సరంలో మీకు మూడేళ్లకు తగినంత దిగుబడిని భూమి ఇచ్చేటువంటి ఆశీర్వాదం నేను పంపుతాను. ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ విత్తనాలు వేయండి. ఆ సంవత్సరంలో మళ్ళీ తొమ్మిదవ సంవత్సరంలో పంట కూర్చునే వరకు మీరు ఆ పంటే తింటారు. “ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు.