ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాను, మరలా దర్శించారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు. యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని, అతడు ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కొడుకును స్వస్థపరచుమని బ్రతిమాలుకొన్నాడు. యేసు అతనితో, “మీరు అద్బుత క్రియలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు” అన్నారు. ఆ రాజ్యాధికారి, “అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి” అని వేడుకొన్నాడు. యేసు, “వెళ్లు, నీ కొడుకు బ్రతుకుతాడు” అని చెప్పారు. యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు. అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి, అతని కొడుకు బాగయ్యాడని తెలియచేశారు. అతడు తన కొడుకు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది” అని వారు చెప్పారు. అప్పుడు ఆ తండ్రి, యేసు తనతో, “నీ కొడుకు బ్రతుకుతాడు” అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి, అతడు, అతని ఇంటి వారు నమ్మారు.
Read యోహాను 4
వినండి యోహాను 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 4:46-53
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు