యోహాను 10:31-36

యోహాను 10:31-36 TCV

ఆయనకు విరోధంగా ఉన్న యూదులు మళ్ళీ ఆయనను కొట్టాలని రాళ్ళను పట్టుకొన్నారు. అయితే యేసు వారితో, “నా తండ్రి నుండి మీకు అనేక మంచి కార్యాలను చూపించాను. వాటిలో దేనిని బట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారా?” అని అడిగారు. “అందుకు యూదులు, నీవు చేసిన మంచిపనుల బట్టి కాదు, నీవు మానవుడవై యుండి దేవుడను అని చెప్పుకొంటూ దైవదూషణ చేస్తున్నందుకు” అని చెప్పారు. యేసు వారితో, “ ‘మీరు “దేవుళ్ళు” అని నేను అన్నాను’ అని మీ లేఖనాలలో వ్రాసిలేదా? దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టివేయడానికి లేదు; దేవుని వాక్యాన్ని పొందుకొనిన వారినే ఆయన ‘దేవుళ్ళు’ అని పిలిచినప్పుడు, తండ్రి తన స్వంతవానిగా ప్రత్యేకపరచుకొని లోకానికి పంపినవాని సంగతేమిటి? ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పినందుకు, దైవదూషణ అని నాపైన నేరం ఎందుకు మోపుతున్నారు?