యాకోబు 2:15-24

యాకోబు 2:15-24 TCV

ఎవరైనా ఒక సహోదరుడు గాని సహోదరి గాని బట్టలు లేకుండా నగ్నంగా వుండి, తినడానికి తిండిలేకుండా వున్నప్పుడు మీలో ఒకరు వారితో “సమాధానంతో వెళ్లి వెచ్చదనం పొంది, తృప్తిగా తిను” అని చెప్పి వారి శరీర అవసరాలను వారికి అందించకపోతే దానిలో మేలు ఏమిటి? కాబట్టి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది. అయితే ఎవరైనా “నీకు విశ్వాసం వుంది, నాకు క్రియలు వున్నాయి.” క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తా అని చెప్పవచ్చును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి. వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం ఫలించదని నీకు రుజువులు కావాలా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా? అతని క్రియలు అతని విశ్వాసం కలిసి పని చేస్తున్నాయి అతడు చేసిన దానిని బట్టి అతని విశ్వాసం సంపూర్ణం అయ్యింది. నెరవేరబడిన లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది.” మరియు అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతని క్రియలు బట్టి నీతిమంతునిగా చెప్పబడును.

యాకోబు 2:15-24 కోసం వీడియో

Free Reading Plans and Devotionals related to యాకోబు 2:15-24