యెషయా 61:1-8

యెషయా 61:1-8 TSA

ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి, సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు. పురాతన శిథిలాలను వారు మరలా కడతారు గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు; పాడైపోయిన పట్టణాలను తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు. అపరిచితులు మీ మందల్ని మేపుతారు; విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు. మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. దేశాల సంపదను మీరు అనుభవిస్తారు వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు. మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు బదులుగా మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది. “ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.

యెషయా 61:1-8 కోసం వీడియో