మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కనుక యాజకులైనవారు అనేకమంది ఉన్నారు. అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కనుక ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగివున్నాడు. తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కొరకు ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కనుక వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు. పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చించబడినవాడై వుండి మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతి దినం, మొదట తన పాపాల కొరకు, తరువాత ప్రజల పాపాల కొరకు బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకొన్నప్పుడే వారందరి పాపాల కొరకు ఒకేసారి అర్పించాడు. ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.
Read హెబ్రీయులకు 7
వినండి హెబ్రీయులకు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హెబ్రీయులకు 7:23-28
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు