ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది. బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు. యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది. హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు. శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు. అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె. వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు: తిమ్నా, అల్వా, యతేతు, ఒహోలీబామా, ఏలహు, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము. వారు ఆక్రమించిన దేశంలో వారి వారి స్థావరాల ప్రకారం, వీరు ఎదోము నాయకులు.
చదువండి ఆది 36
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 36:31-43
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు