ఆది 36:20-30

ఆది 36:20-30 TSA

ఆ ప్రాంతంలో నివసిస్తున్న హోరీయుడైన శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు. లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా. శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము. సిబ్యోను కుమారులు: అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి గాడిదలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్యంలో నీటి ఊటలను కనుగొన్నాడు. అనా సంతానం: కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా. దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను. వీరు హోరీయుల నాయకులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను ఏసెరు దిషాను. శేయీరులో వంశావళి ప్రకారం, వీరు హోరీయుల నాయకులు.

Read ఆది 36

ఆది 36:20-30 కోసం వీడియో