“ఒకవేళ ప్రజలు పోట్లాడుకుంటూ గర్భవతియైన స్త్రీని కొట్టినప్పుడు ఆమె అకాల జన్మనిస్తే ఆమెకు గర్భస్రావమై మరి ఏ ఇతర గాయాలు కాకపోతే, దానికి కారణమైనవాడు ఆమె భర్త అడిగిన నష్టపరిహారాన్ని న్యాయాధిపతులు నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి. తీవ్రమైన గాయాలు అయినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, నలిపివేతకు నలిపివేత. “ఒక యజమాని కొట్టడం వలన అతని దాసునికి గాని దాసికి గాని కన్ను పోతే కంటికి కలిగిన నష్టాన్ని బట్టి ఆ యజమాని వారిని స్వతంత్రంగా పోనివ్వాలి. యజమాని తన దాసునిది గాని దాసిది గాని పన్ను ఊడగొడితే ఆ పంటికి బదులుగా వారిని స్వతంత్రంగా పోనివ్వాలి. “ఒక ఎద్దు పురుషుని గాని స్త్రీని గాని చనిపోయేంతగా పొడిస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని మాంసం ఎవరూ తినకూడదు. కాని ఆ ఎద్దు యజమాని నిర్దోషి. అయితే ఎద్దుకు అంతకుముందే స్త్రీని గాని పురుషుని గాని పొడిచే అలవాటు ఉండి, దాని యజమానిని ఈ విషయంలో హెచ్చరించినా అతడు దానిని కట్టి అదుపులో పెట్టకపోవడం చేత ఆ ఎద్దు ఎవరినైనా చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని యజమానికి మరణశిక్ష విధించాలి. ఒకవేళ నష్టపరిహారం అడిగితే ఆ యజమాని ఆ నష్టపరిహారాన్ని చెల్లించి తన ప్రాణాన్ని విడిపించుకోవచ్చు. ఆ ఎద్దు కుమారుని గాని కుమార్తెను గాని పొడిచినా ఇదే నియమం వర్తించబడుతుంది. ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. “ఒకరు గొయ్యిని తెరచి ఉంచడం వలన లేదా గొయ్యి త్రవ్వి దానిని మూయకపోవడం వలన ఎద్దు గాని గాడిద గాని దానిలో పడిపోతే ఆ గోతి యజమాని వాటి యజమానికి నష్టపరిహారం చెల్లించాలి; చచ్చిన జంతువు గొయ్యి యజమానిదవుతుంది. “ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును గాయపరచగా అది చనిపోతే ఆ ఇద్దరు బ్రతికి ఉన్న ఎద్దును అమ్మగా వచ్చిన డబ్బును చచ్చిన ఎద్దును చెరిసగం పంచుకోవాలి. ఆ ఎద్దుకు అంతకుముందే పొడిచే అలవాటు ఉంటే దాని యజమాని దానిని కట్టి అదుపులో పెట్టలేదు కాబట్టి అతడు ఖచ్చితంగా ఎద్దుకు బదులు ఎద్దు ఇవ్వాలి; చచ్చిన ఎద్దు అతనిది అవుతుంది.
చదువండి నిర్గమ 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమ 21:22-36
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు