నిర్గమ 11:4-9

నిర్గమ 11:4-9 TSA

మోషే ఫరోతో, “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశం గుండా వెళ్తాను. అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి. అప్పుడు ఈజిప్టు దేశమంతటా పెద్ద రోదన ఉంటుంది. అటువంటి రోదన గతంలో ఎప్పుడూ లేదు ఇకముందు ఉండదు. అయితే ఇశ్రాయేలీయులలో ఏ వ్యక్తిని చూసి కానీ లేదా జంతువును చూసి గాని ఒక కుక్క కూడా మొరుగదు.’ అప్పుడు యెహోవా ఈజిప్టు, ఇశ్రాయేలు మధ్య భేదం చూపించారని మీకు తెలుస్తుంది. అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు. అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశంలో నా అద్భుతాలు అధికమయ్యేలా ఫరో నీ మాట వినడం తృణీకరిస్తాడు” అన్నారు.

నిర్గమ 11:4-9 కోసం వీడియో