ఎఫెసీ పత్రిక 4:22-31

ఎఫెసీ పత్రిక 4:22-31 TSA

మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి, మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము. “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి. దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి. విమోచన దినం కోసం మీరు ఎవరితో ముద్రించబడ్డారో ఆ దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. అదే విధంగా, ద్వేషమంతటిని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.