ప్రసంగి 9:14-18

ప్రసంగి 9:14-18 TSA

ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు. కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు. మూర్ఖుల పాలకుడి కేకల కంటే జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది. యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు, కాని ఒక్క పాపి అనేకమైన మంచి వాటిని నాశనం చేస్తాడు.