2 కొరింథీ పత్రిక 3:1-6

2 కొరింథీ పత్రిక 3:1-6 TSA

మమ్మల్ని మేమే మరల మెచ్చుకోవడం ప్రారంభించామా? లేదా ఇతరుల్లా మీకు గాని మీ దగ్గరి నుండి గాని మాకు సిఫారసు పత్రికలు అవసరమా? మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకుని చదవాల్సిన మా పత్రిక మీరే. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు తెలియపరుస్తున్నారు. ఇలాంటి నమ్మకం క్రీస్తు ద్వారా దేవునిపై మాకుంది. మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది. వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.