2 దినవృత్తాంతములు 30:6-9

2 దినవృత్తాంతములు 30:6-9 TSA

రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు. తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు. మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు. మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”