1 సమూయేలు 10:1-6

1 సమూయేలు 10:1-6 TSA

అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు. ఈ రోజు నీవు నా దగ్గరి నుండి వెళ్లిన తర్వాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనబడతారు. వారు నీతో, ‘నీవు వెదకుతున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి వాటి గురించి ఆలోచించడం మాని నీకోసం కంగారు పడుతూ, “నా కుమారుని గురించి నేనేమి చేయాలి?” అని అడుగుతున్నాడు’ అని చెప్తారు. “తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు. వారు నీ క్షేమసమాచారాన్ని తెలుసుకుని రెండు రొట్టెలు ఇస్తారు, నీవు వాటిని తీసుకోవాలి. “ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చినప్పడు, నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు; నీవు క్రొత్త వ్యక్తిగా మారతావు.

Read 1 సమూయేలు 10