ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు? ఈ మాటలు కేవలం మానవ అధికారంతో చెప్తున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తున్నది కదా! మోషే ధర్మశాస్త్రంలో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు” అని వ్రాయబడి ఉంది. దేవుడు ఎద్దులను గురించి చెప్తున్నారా? ఖచ్చితంగా ఆయన మన కొరకే ఈ మాట చెప్పలేదా? అవును, ఇది ఖచ్చితంగా మన కొరకే వ్రాయబడింది, ఎందుకంటే పొలాన్ని దున్నేవారు, త్రొక్కేవారు పంటలో భాగం పొందాలనే ఆశతో పని చేయాలి. మీ మధ్యలో ఆత్మ సంబంధమైన విత్తనాన్ని మేము నాటితే, మీ నుండి ఈ లోకసంబంధమైన పంటను మేము కోస్తే అది గొప్ప విషయమా? మీ నుండి సహాయం పొందడానికి ఇతరులకు హక్కు ఉంటే, మాకు మరి ఎక్కువ హక్కు ఉండదా? అయితే, ఈ హక్కును మేము ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఆటంకంగా ఉండకూడదని అన్ని ఇబ్బందులను మేము సహిస్తున్నాము. దేవాలయంలో పని చేసేవారు దేవాలయం నుండే తమ ఆహారాన్ని పొందుతారని, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠం మీద అర్పించిన వాటిలో పాలిభాగస్థులని మీకు తెలియదా? అలాగే, సువార్తను ప్రకటించేవారు సువార్త వల్లనే తమ జీవనోపాధి పొందుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించారు. కాని, నేనైతే వీటిలో దేన్ని ఉపయోగించుకోలేదు. నా పట్ల మీరు ఇలా చేయాలని ఈ సంగతులు వ్రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవరైనా వట్టిదిగా చేస్తే దానికన్నా నాకు మరణమే మేలు. సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ! నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను. అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.
చదువండి 1 కొరింథీ పత్రిక 9
వినండి 1 కొరింథీ పత్రిక 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీ పత్రిక 9:7-18
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు