1 కొరింథీ 5:1-5

1 కొరింథీ 5:1-5 TCV

మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా! ఇలాంటి వ్యభిచారం యూదేతరులు కూడా సహించరు. ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖంతో ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయవలసి ఉండింది కదా! నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా, నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కనుక మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేసాను. ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీ సమక్షంలో మీతో ఉన్నాను. కనుక వానిని సాతానుకు అప్పగించాలి, అప్పుడు వాని శరీరం నశించినా కానీ ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడుతుంది.