కీర్తనల గ్రంథము 71:17-24

కీర్తనల గ్రంథము 71:17-24 TERV

దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు. నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను. దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను. దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది. దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు. నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు. నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు. కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు. భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు. ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము. నన్ను ఆదరిస్తూనే ఉండుము. స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను. నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను. అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.