నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుడు నన్ను కాపాడుతాడు. దేవుడు మంచి న్యాయమూర్తి, మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు. దేవుడు ఒక నిర్ణయం చేస్తే ఆయన తన మనస్సు మార్చుకోడు. ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది. కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు. వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు. అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు. వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు. ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు. అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు. యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను. మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.
చదువండి కీర్తనల గ్రంథము 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 7:10-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు