కీర్తనల గ్రంథము 69:13-17

కీర్తనల గ్రంథము 69:13-17 TERV

నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. బురదలో నుండి నన్ను పైకి లాగుము. బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు. నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము. అలలు నన్ను ముంచివేయనీయకుము. లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము. సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము. నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము. నీ సేవకునికి విముఖుడవు కావద్దు. నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.