కీర్తనల గ్రంథము 17:3-5
కీర్తనల గ్రంథము 17:3-5 TERV
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు దాన్ని లోతుగా చూశావు. రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు. నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు. నీ ఆదేశాలకు విధేయుడనగుటకు నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను. నేను నీ మార్గాలు అనుసరించాను. నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.

