యెహోవా దయగలవాడు, కరుణగలవాడు. యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు. యెహోవా, అందరి యెడలా మంచివాడు. దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు. యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి. నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు. ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు. నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు. కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. నీవు శాశ్వతంగా పాలిస్తావు. పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు. కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు. యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి. సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు. యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి, జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు. యెహోవా చేసే ప్రతీదీ మంచిది. యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు. యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు. యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు. యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు. మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
చదువండి కీర్తనల గ్రంథము 145
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 145:8-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు