కీర్తనల గ్రంథము 119:169-176

కీర్తనల గ్రంథము 119:169-176 TERV

యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము. యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము. నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను. నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము. నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి. నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను. కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి. యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము. నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను. యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము. నేను నీ సేవకుడను. మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.