దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు. దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు. నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు. ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు. ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు. నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు. కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను. కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు. నేను వారిని ప్రేమించాను. కాని వారు నన్ను ద్వేషించారు. నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము. వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము. నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము. నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము. నా శత్రువును త్వరగా చావనిమ్ము. నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక! నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక! వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక! నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము. అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము. నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
చదువండి కీర్తనల గ్రంథము 109
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 109:1-13
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు