యోబు 28:20-28

యోబు 28:20-28 TERV

“అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు. ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి. “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు. భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు. గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు, వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీక్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు. ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’” అని దేవుడు ప్రజలతో చెప్పాడు.

Read యోబు 28