దేవుడు చెబుతున్నాడు, “అరీయేలును చూడండి! అరీయేలు, దావీదు మజిలీ చేసిన పట్టణం. దాని పండుగలు సంవత్సరం సంవత్సరం కొనసాగుతున్నాయి. అరీయేలును నేను శిక్షించాను ఆ పట్టణం దుఃఖంతో, ఏడ్పుతో నిండిపోయింది. కానీ అది ఎప్పటికీ నా అరీయేలే. “నీ చుట్టూ సైన్యాలను ఉంచాను అరీయేలూ. నీకు విరోధంగా నేను యుద్ధగోపురాలను లేపాను. నీవు ఓడించబడి, నేల మట్టం చేయబడ్డావు. ఇప్పుడు ఒక పిశాచి స్వరంలా నీ స్వరం నేలలోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.” అక్కడ చాలామంది క్రొత్తవాళ్లు దుమ్ముకణాల్లా ఉన్నారు. గాలికి ఎగిరే పొట్టులాంటి క్రూరమైన మనుష్యులు చాలామంది అక్కడ ఉన్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్మల్ని శిక్షించాడు. ఉరుములు, భూకంపాలు, మహా గొప్ప శబ్దాలు ప్రయోగించి యెహోవా మిమ్మల్ని శిక్షించాడు తుఫానులు, బలమైన గాలులు, కాల్చివేసే అగ్ని ఉపయోగించి యెహోవా నాశనం చేశాడు. అరీయేలు మీద ఎన్నెన్నో దేశాలు యుద్ధం చేశాయి. అది రాత్రి వేళ కలిగే భయంకరపీడ కలలాంటిది. అరీయేలు చుట్టూ సైన్యాలు వచ్చేసి దానిని శిక్షించాయి. కానీ ఆ సైన్యాలకు కూడ అది ఒక కలలా ఉంటుంది ఆ సైన్యాలకు అవసరమైనవి దొరకవు. ఆకలితో ఉన్నవానికి అన్నం గూర్చి కలవచ్చినట్టు ఉంటుంది. వాడు మేల్కొన్నప్పుడు ఆకలి అలానే ఉంటుంది. దప్పిగొన్నవాడు నీళ్లను గూర్చి కలగన్నట్టు ఉంటుంది. వాడు మేల్కోంటాడు, దాహంతోనే ఉంటాడు. సీయోనుకు విరోధంగా పోరాడే రాజ్యాలన్నింటి విషయంలోను ఇదే సత్యం. ఆ రాజ్యాలకు కావాలనుకొన్నవి దొరకవు. ఆశ్చర్యపడండి, విస్మయం చెందండి! మీరు మత్తులవుతారు కాని ద్రాక్షరసంతో కాదు, చూచి ఆశ్చర్యపడండి! మీరు తూలి, పడతారు కానీ మద్యంతో కాదు. యెహోవా మిమ్మల్ని నిద్రబుచ్చుతాడు యెహోవా మీ కళ్లు మూస్తాడు (ప్రవక్తలే మీ కళ్లు) యెహోవా మీ తలలు కప్పుతాడు (ప్రవక్తలే మీ తలలు.)
చదువండి యెషయా 29
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 29:1-10
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు