సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ఈ ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు. వారి ముగ్గురు కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు.
యెహోయాదా కుమారుడైన బెనాయా వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. అతడు కబ్సెయేలను ఊరివాడు. బెనాయా చాలా సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతేకాదు మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు. ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా అటువంటి కార్యాలు చాలా చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె ప్రసిద్ధి గాంచాడు. ముప్పై మంది సైనికులలోను బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా చేశాడు.
యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి పేర్లు:
బేత్లేహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను,
హరోదీయుడైన షమ్మా,
హరోదీయుడైన ఎలీకా,
పల్తీయుడైన హేలెస్సు,
తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడగు ఈరా,
అనాతోతీయుడైన అబీయెజరు,
హుషాతీయుడైన మెబున్నయి,
అహోహీయుడైన సల్మోను,
నెటోపాతీయుడైన మహర్తె,
నెటోపాతీయుడగు బయానా కుమారుడైన హేలెబు,
బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
పిరాతోనీయుడైన బెనాయా,
గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడైన హిద్దయి,
అర్బాతీయుడైన అబీయల్బోను,
బర్హుమీయుడైన అజ్మావెతు,
షయల్బోనీయుడైన ఎల్యహ్బా,
యాషేను కుమారులలో
హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను,
హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,
మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడగు ఎలీపేలెటు,
గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,
కర్మెతీయుడైన హెస్రై,
అర్బీయుడైన పయరై,
సోబావాడగు నాతాను కుమారుడైన ఇగాలు,
గాదీయుడైన బానీ,
అమ్మోనీయుడైన జెలెకు,
బెయేరోతీయుడైన నహరై, (సెరూయా కుమారుడైన యోవాబునకు ఆయుధాలు మోసే సహాయకులు,)
ఇత్రీ యుడగు ఈరా,
ఇత్రీయుడగు గారేబు,
మరియు హిత్తీయుడైన ఊరియా.